- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్.. హైప్ పెంచుతున్న వీడియో
నేచురల్ స్టార్ నాని(nani) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). దీనికి‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏకంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈక్రమంలో.. మంచు లక్ష్మి ఓ బిగ్ అప్డేట్ ఇస్తూ అంచనాలను మరింత పెంచింది. ‘‘ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చిందా లేదా అనేది నాకు తెలియదు కానీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.
నాన్న మోహన్ బాబు కూడా నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో భాగం అయ్యారు. ఆయన ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం ఈ వయసులోనూ చాలా కష్టపడుతున్నారు. ప్రతి సినిమాలు తన మొదటి ప్రాజెక్ట్‌లా ట్రీట్ చేసుకోవడం మా నాన్నగారి గొప్పతనం. ఆయన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నాను. నాన్నను చూసి నేనోంతో ఇన్‌స్పైర్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






