‘‘నన్ను నేను కోల్పోయే కంటే సినిమాలను కోల్పోవడమే మేలు’’ .. టాక్సిక్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-08 05:29:54  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ తారా సుతారియా(Tara Sutaria) గత కొంతకాలంగా తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

‘‘నన్ను నేను కోల్పోయే కంటే సినిమాలను కోల్పోవడమే మేలు’’ .. టాక్సిక్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ తారా సుతారియా(Tara Sutaria) గత కొంతకాలంగా తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తోటి నటుడు వీర్ పహారియా(Veer Pahariya)తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, వీరిద్దరూ ఎప్పుడూ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఇంటర్వ్యూలో తారా సుతారియా తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ప్రశాంతతను కాపాడుకోవడం ఎలాగో నేర్చుకున్నానని, పని కంటే తన విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేసింది.

తనపై వస్తున్న ప్రతి పుకారుపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తారా గట్టిగా చెప్పింది. ‘‘నిజం ఏంటో నాకు, నా సన్నిహితులకు తెలిస్తే చాలు.. అదే నాకు ముఖ్యం’’ అని అంటోంది. విజయం అనేది అంతర్గతమైనదని, మనశ్శాంతి, మనల్ని ప్రేమించే కొద్దిమంది వ్యక్తులు పక్కన ఉండటమే అసలైన గమ్యమని ఆమె వివరించింది. ఈ ప్రయాణంలో తనను తాను కోల్పోయే కంటే, కొన్ని సినిమాలను కోల్పోవడానికైనా సిద్ధమేనని’’ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక నటిగా ఎదుర్కొనే విమర్శలను, నెగటివిటీని తాను స్వీకరిస్తున్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

ఇక తారా సుతారియా సినిమాల విషయానికొస్తే.. త్వరలో ఈ అమ్మడు ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో యష్ , కియారా అద్వానీ , నయనతార , హుమా ఖురేషి , తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ర , హుమా ఖురేషి , తారా సుతారియా , కైల్ పాల్ మరియు రుక్మిణి వసంత్ నటించారు . ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ మరియు యష్ సంయుక్తంగా కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి19న ఉగాది కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.. మెగా బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

Next Story