- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.. మెగా బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది.
అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు, ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా రకుల్ తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిదా ఆహా అనిపించింది. కళ్లతోనే గత్తర లేపింది. ఇక వీటికి.. ‘హూ నా మెయిన్ గ్రీన్ ఫారెస్ట్.. #DDPD2(దేదే ప్యార్ దే-2)కి ఉత్తమ నటి అవార్డు అందించిన @zee గారికి చాలా ధన్యవాదాలు. ఈ అవార్డు నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి& నన్ను వారి ఆయేషాగా నమ్మిన మొత్తం బృందానికి.. చాలా ప్రేమ మరియు చాలా కృతజ్ఞతతో వారికి డెడికేట్ చేస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్, బ్యూటిఫుల్, కంగ్రాట్స్, చాలా అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్(Ajay Devgan), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) జంటగా నటించిన చిత్రం దే దే ప్యార్ దే 2(DeDe Pyar De). గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దే దే ప్యార్ దేకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. టీ సిరీస్ ఫిల్మ్స్, లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషాణ్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. మాధవన్, జావెద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, గౌతమి కపూర్, ఇషిత దత్తా, సంజీవ్ సేథ్, సుహాసినీ ములే, గ్రేసీ గోస్వామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
బాక్సాఫీస్ వద్ద మీనాక్షి చౌదరీ ఊచకోత.. గోల్డెన్ చాన్స్ కొట్టేసిందిగా!






