- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లు అయిందని సినిమా చేయాలని వెళ్లా.. రవితేజ చంపేస్తా అన్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ‘కలర్ ఫొటో’ మూవీతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ‘కలర్ ఫొటో’ మూవీతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. డెబ్యూ మూవీతోనే నేషనల్ ఫిలిం అవార్డును గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు తన నిర్మాణంలో ‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’(AIR - All India Rankers) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను ఎవరి దగ్గరకు వెళ్లినా వాళ్లని మించిన కథను తీసుకొని వెళ్తున్నాను. దాని వల్ల బడ్జెట్ సెట్ అవ్వడం లేదు. ఒక సినిమా కోసం హీరో రవితేజతో ట్రావెల్ చేశాను. అయితే ఈ ఏడాది కూడా ఆయన బిజీగా ఉన్నారు.
‘అనవసరంగా నీ గోల్డెన్ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్.. నాకు రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి. అర్థం చేసుకో అబ్బాయ్’ అని రవితేజ నాతో అన్నారు. అప్పటికే మూడేళ్లు అయింది. నేను ఇంకో కథ రాసుకోవడం స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా చేసుకొని రమ్మన్నారు. నాకు చెప్పిన కథ ఇంకెవరితో అయినా తీస్తే చంపేస్తాను.. నాతోనే తీయాలి అని రవితేజ అన్నారు. అది మీకోసమే రాసిన స్టోరీ అని చెప్పాను. ఫ్రెష్ గా ఈసారి థియేట్రికల్ డెబ్యూ చేస్తున్నానని అనుకోని ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాయాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






