ఆ విషయాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే.. బరువు కారణంగా పెద్ద ప్రాజెక్ట్ నుంచి తొలగించారు: రాధికా ఆప్టే

by Mallepaka Hamsa |

సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఎంత నాజుకుగా ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి.

ఆ విషయాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే.. బరువు కారణంగా పెద్ద ప్రాజెక్ట్ నుంచి తొలగించారు: రాధికా ఆప్టే
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఎంత నాజుకుగా ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. కానీ బరువు పెరిగి బొద్దుగా ఉంటే మాత్రం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వారికి దర్శకనిర్మాతలు చాన్స్ ఇవ్వాలన్నా చాలా ఆలోచిస్తుంటారు. కొంతమందిని బరువు కారణంగా కూడా పలు ప్రాజెక్ట్స్ నుంచి తొలగించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలాంటి అనుభవమే తనకు కూడా ఎదురైనట్లు హాట్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte)వెల్లడించింది. ‘‘కొన్ని రోజుల క్రితం నాకు ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ వచ్చింది. ఆ కథలోని ఓ పాత్రను నాకోసమే తీర్చిదిద్దారు. దీంతో కొన్ని రోజులు ట్రిప్‌కి వెళ్లి షూటింగ్‌కి వస్తానని చెప్పాను. షూట్‌కి మరో నాలుగైదు నెలలు పడుతుందని అనుకున్నా.

కానీ నేను ట్రిప్ నుంచి రాగానే మొదలెట్టారు. ఫోటోషూట్ చేయడంతో కాస్త బొద్దుగా కనిపించా. దాంతో నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అందులో నటించిన నటీనటుల జీవితమే మారిపోయింది. ఒకవేళ అందులో నేను నటించి ఉంటే.. నా కెరీర్ మరోలా ఉండేది. ఇండస్ట్రీలో హీరోయిన్ల బరువు గురించి మాట్లాడటం సర్వసాధారమే అయినప్పటికీ దాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే’’ అని చెప్పింది. రాధికా ఆప్టే కేవలం 3 కేజీల బరువు పెరగడంతో లక్కీ చాన్స్ మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

Next Story