విశ్వక్‌తో రచ్చ చేసేందుకు రెడీ అయిన జిగేల్ రాణి.. ఇక కుర్రాళ్లకు ముచ్చెమటలే

by Disha Web Desk 7 |
విశ్వక్‌తో రచ్చ చేసేందుకు రెడీ అయిన జిగేల్ రాణి.. ఇక కుర్రాళ్లకు ముచ్చెమటలే
X

దిశ, సినిమా: విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ వెలువడింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ విలేజ్ పొలిటికల్ డ్రామాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తుండగా.. దీనికోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

‘బాహుబలి’, ‘రంగస్థలం’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న బోల్డ్ బేబి స్పెషల్ సాంగ్‌ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఇక ఊర మాస్‌గా ఉండబోతున్న ఈ సాంగ్‌కు నోరా అయితేనే న్యాయం చేయగలదని భావించిన మేకర్స్.. ఆమె బోల్డ్ స్టెప్పులను మరింత స్పెషల్ ఎట్రాక్షన్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Next Story