‘ఇడ్లీ కడై’ సినిమాలో అలాంటి పాత్రలో నటించడం చాలా ఎక్జైటింగ్‌గా ఉంది: అరుణ్ విజయ్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు విభిన్న పాత్రల్లో నటిస్తూనే పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.

‘ఇడ్లీ కడై’ సినిమాలో అలాంటి పాత్రలో నటించడం చాలా ఎక్జైటింగ్‌గా ఉంది:  అరుణ్ విజయ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు విభిన్న పాత్రల్లో నటిస్తూనే పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఈ సినిమాను డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ధనుషం సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శాలిని పాండే(Shalini Pandey), సత్యరాజ్, పార్తిబన్, సుమతిరకని, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈక్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా, చిత్రబృందం ఈ సినిమా నుంచి అరుణ్ విజయ్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘ఇడ్లీ కడై’ చిత్రంలో ఆయన అశ్విన్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అరుణ్ విజయ్ ధనుష్‌కు స్పెషల్ థాంక్స్ చెప్తూ.. ‘‘ఇడ్లీకడైలో అశ్విన్ పాత్ర పోషించడం నిజంగా చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు నా సోదరుడు ధనుష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులోని ప్రతి ఒక్కటి నాకు చాలా నచ్చింది. అక్టోబర్ 1 నుండి పెద్ద తెరపై మొదటిసారి మా కెమిస్ట్రీని మీరు చూసే వరకు వేచి ఉండలేను’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో అరుణ్ విజయ్ వెనకాల అన్ని పొడవాటి భవనాలు అందమైన లైట్స్‌తో కనిపిస్తుండగా.. ఆయన ఏదో కోపంగా చూస్తున్నట్లుగా ఉండి అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాడు.

link

Next Story