- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన వల్లే నాకు ఈ అవార్డు లభించింది.. బన్నీ పోస్ట్ వైరల్
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం గొప్పగా ఉందంటున్నాడు అల్లు అర్జున్.

X
దిశ, సినిమా: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం గొప్పగా ఉందంటున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు ఈ విజయం డైరెక్టర్ సుకుమార్‌కే దక్కుతుందంటూ సోషల్ మీడియా వేదికగా అవార్డు స్వీకరించిన ఫొటోలను పంచుకున్నాడు. ‘జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్య శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది నేను మాత్రమే సాధించిన మైలురాయి కాదు.. సినిమాను ఆధరించిన వారందరికీ చెందుతుంది. సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విజయానికి ఆయనే కారణం’ అంటూ తనదైన స్టైల్‌లో దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు. అలాగే అవార్డు విజేతలు అలియా భట్, కృతిసనన్‌లతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ .. ‘ఇవి ఎంతో అందమైన, అరుదైన క్షణాలు’ అంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Next Story






