- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృతి సనన్‌ను తక్కువ చేసి అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు: యామీ గౌతమ్
నేను ఒక నటిని కించపరిచేలా ఉన్న వీడియోను లైక్ చేశానని నా దృష్టికి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటీమణులు యామీ గౌతమ్(Yami Gautam), కృతి సనన్(Kriti Sanon) మధ్య సోషల్ మీడియా వేదికగా వివాదం తలెత్తింది. ఇటీవల జరిగిన ‘జీ సినీ అవార్డ్స్’ వేడుకలో కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అయితే, ఈ గెలుపును విమర్శిస్తూ రూపొందించిన ఒక వీడియోకు యామీ గౌతమ్ 'లైక్' చేయడంతో నెట్టింట పెద్ద దుమారమే రేపింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో, యామీ తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటనకు గానూ కృతి సనన్‌కు ఉత్తమ నటి అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే, ‘హక్’ సినిమాతో ఆ అవార్డుకు యామీ గౌతమ్ మరింత అర్హురాలని నెటిజన్లలో ఒక వర్గం అభిప్రాయపడింది.
ఈ క్రమంలో, కృతి సనన్ గెలుపును తక్కువ చేస్తూ.. గతంలో యామీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్‌ను జోడిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో యామీ, "అవార్డు వస్తేనే మంచి నటి అని కాదు.. నేను ఎవరి గుర్తింపును కోరుకోవడం లేదు" అని అన్న మాటలు ఉన్నాయి. ఈ వీడియోను యామీ లైక్ చేయడంతో, ఆమె కృతిపై అసూయతో ఉందని కొందరు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఈ వివాదంపై స్పందిస్తూ, అది పొరపాటున జరిగిన 'లైక్' అని యామీ స్పష్టం చేశారు. "నేను ఒక నటిని కించపరిచేలా ఉన్న వీడియోను లైక్ చేశానని నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజూ మమ్మల్ని వందలాది పోస్టుల్లో ట్యాగ్ చేస్తూ ఉంటారు. అవార్డు ఫంక్షన్ హడావిడిలో పొరపాటున ఆ వీడియోపై క్లిక్ అయి ఉండవచ్చు తప్ప, కావాలని చేసింది మాత్రం కాదు.
నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి చీప్ పీఆర్ టెక్నిక్స్ ఉపయోగించలేదు. నాకు అసలు పీఆర్ టీమే లేదు. అవార్డుల మీద నా అభిప్రాయం ఏంటో ఎప్పుడో చెప్పేశాను. నేను కేవలం నా పని మీద మాత్రమే దృష్టి పెడతాను. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ నమ్మవద్దు, నాకు అంతకంటే మంచి పేరు ఉందని ఆశిస్తున్నాను’’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. క్లిక్‌బైట్ వార్తల కోసం గౌరవప్రదమైన నటీమణుల మధ్య చిచ్చు పెట్టవద్దని ఆమె కోరారు. మరోవైపు, ఈ వివాదంపై నెటిజన్లు కొందరు యామీకి మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు ఆమె ప్రవర్తనపై పెదవి విరుస్తున్నారు. కృతి, యామీ ఇద్దరూ ప్రతిభావంతులేనని, అవార్డు ఎవరికి వచ్చినా గౌరవించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.






