- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కాబోతున్న అవికా గోర్.. అలాంటి వీడియోతో హింట్ ఇవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
గతంలోనే ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చినప్పటికీ, తాజా సంఘటనతో ఆ రూమర్స్ మళ్ళీ ఊపందుకున్నాయి.

దిశ, సినిమా: ‘చిన్నారిపెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్(Avicha Gore), హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమె, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, నిర్మాతగా కూడా బిజీగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో తన లాంగ్ టైమ్ ప్రియుడు మిలింద్ చాంద్వాని(Milind Chandwani)ని వివాహం చేసుకున్న అవికా, పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే, పెళ్లయిన కొద్ది నెలల నుంచే ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గతంలోనే ఈ వార్తలపై అవికా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చినప్పటికీ, తాజా సంఘటనతో ఆ రూమర్స్ మళ్ళీ ఊపందుకున్నాయి.
ఇటీవల అవికా తన భర్త మిలింద్‌తో కలిసి ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్ ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అవికా చాలా అసౌకర్యంగా కనిపించింది. అంతలోనే ఆమెకు ఉన్నట్టుండి వాంతులు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.అవికా ఇబ్బంది పడుతుండటం చూసిన భర్త మిలింద్ వెంటనే స్పందించి, తన భార్యను ఫోటోలు తీయవద్దని మీడియాను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అవికా ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడంతో, ఆమె తల్లి కాబోతోందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. "అవికా గోర్ తన మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతుందా? అందుకే ఇలా వాంతులు చేసుకుందా?" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఆమె గర్భవతి అని ఫిక్స్ అయిపోయి, దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. అయితే ఈ విషయంపై అవికా కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజంగా ఇది ప్రెగ్నెన్సీ వల్లే జరిగిందా లేక అనారోగ్యం కారణమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ వీడియో చూసిన అవికా అభిమానులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లు అంటే?






