- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదొక భయంకరమైన పరిస్థితి.. నా వాళ్లను చూస్తానో లేదో అనుకున్నానంటూ ఇషా గుప్తా ఎమోషనల్ పోస్ట్
క్షిపణులు ఆకాశంలో కనిపిస్తున్న వేళ.. తర్వాతి నిమిషం ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి అది

దిశ, సినిమా: మిడిల్ ఈస్ట్‌లో క్షిపణి దాడుల కారణంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్య బాలీవుడ్ నటి ఇషా గుప్తా(Esha Gupta) అబుదాబి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు అక్కడ గందరగోళం నెలకొన్నప్పటికీ, తాజాగా ఆమె సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అబుదాబిలో తాను చూసిన పరిస్థితులను, అక్కడి ప్రభుత్వం ప్రయాణికులకు అందించిన అద్భుతమైన సాయాన్ని ఆమె సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరించారు. ఫిబ్రవరి 28న ఇషా గుప్తా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా క్షిపణి దాడుల వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం 1 గంటకే ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ‘‘ఆ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఒకరినొకరు ఓదార్చుకుంటూ, స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసుకున్నారు.
క్షిపణులు ఆకాశంలో కనిపిస్తున్న వేళ.. తర్వాతి నిమిషం ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితి అది’’ అని ఇషా పేర్కొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా యూఏఈ ప్రభుత్వం ,ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వ్యవహరించిన తీరును ఇషా కొనియాడారు. ‘‘ఎయిర్‌పోర్ట్ మూసివేసిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు ఆహారం కోసం నగదు పంపిణీ చేయడమే కాకుండా, రాత్రి 9 గంటలకల్లా బస్సులను ఏర్పాటు చేసి అందరినీ సురక్షితంగా హోటళ్లకు తరలించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు హోటల్ యాజమాన్యాలు ప్రయాణికులకు ఉచితంగా వసతి, భోజనం కల్పించాయి. ఎక్కడా ఎటువంటి కొరత లేకుండా చూశారు’’ అని ఆమె వివరించారు. చివరికి నిన్న మధ్యాహ్నం ఎతిహాద్ ఎయిర్‌వేస్ ద్వారా మొదటి కమర్షియల్ ఫ్లైట్‌లో ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ‘‘మళ్లీ నా వాళ్లను చూస్తానో లేదో అనుకున్నాను. తిరిగి ఇంటికి రావడం దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. రాధే రాధే’’ అంటూ ఇషా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






