- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదొక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్.. దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను: ఆలియా భట్
భన్సాలీ గారితో పని చేయడం అంటే అది ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్. ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో బిజీగా ఉంది. తాజాగా, అక్కడ వోగ్ ఇటాలియాతో ముచ్చటిస్తూ తన కొత్త సినిమా ‘లవ్ అండ్ వార్’ (Love & War)అప్‌డేట్ ఇచ్చింది. ‘‘ప్రస్తుతం నేను సంజయ్ లీలా భన్సాలీ గారి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నాను. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. భన్సాలీ గారితో పని చేయడం అంటే అది ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్. ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం, దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని ఆలియా తన సంతోషాన్ని పంచుకుంది.
గతంలో భన్సాలీ-అలియా కాంబోలో వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి అలియా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అందుకే ఈ రెండో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియాతో పాటు ఆమె భర్త రణ్‌బీర్ కపూర్, అలాగే విక్కీ కౌశల్ కూడా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఈ సినిమాను 2025 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల డేట్ మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మార్చి 20, 2026న థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. రణ్‌బీర్- ఆలియా జంటను మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






