అదొక అత్యుత్తమ అనుభవం.. ఈ సినిమాతో పూర్తిగా మారిపోయానంటూ అనుపమ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

రింగుల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison).

అదొక అత్యుత్తమ అనుభవం.. ఈ సినిమాతో  పూర్తిగా మారిపోయానంటూ అనుపమ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: రింగుల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’(Bison). మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో రూపొందుతోంది. పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతుంది.

ఇక తెలుగులో జగదంబే ఫిలిమ్స్‌పై బాలాజీ అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నా మొదటి సినిమా నుండి ‘బైసన్’ వరకు, నేను ఒక రకమైన నటిని. కానీ ‘బైసన్’తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. ఆ తర్వాత నా సినిమాలు ఏవీ నాకు అదే సంతృప్తిని ఇవ్వగలుగుతాయని నేను అనుకోవడం లేదు.

‘ప్రేమమ్’ తర్వాత బైసన్ నా అత్యుత్తమ అనుభవం. ఈ సినిమాలో నాలోని మరొక వెర్షన్‌ను చూస్తారు. ఈ మూవీ షూటింగ్ తర్వాత చాలా సెట్స్‌కి వెళ్లాను కానీ అంత సంతృప్తిని ఇవ్వలేదు. తెలుగులో చాలా చిత్రాలు చేశాను.. కానీ ఇది చాలా ప్రత్యేకం. మారి సెల్వరాజ్ ఫోన్ చేయడమే చాలా ముఖ్యమైన అంశం. అలాంటిది నాకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. సెట్‌లో నేను చాలాసార్లు మారి సర్‌ని చూసి స్టక్ అయిపోయాను. కానీ మీరు ఆయనను అర్థం చేసుకున్న తర్వాత మారి సార్ చాలా నిజాయితీగా కనిపిస్తాడు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story