- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ-2’ గురించి ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం: సురేష్ బాబు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ-2’ (Akhanda-2)చివరి నిమిషంలో వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ-2’ (Akhanda-2)చివరి నిమిషంలో వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. కోర్ట్ వరకు వెళ్లిన ఈ కేసు ఇంకా ఎలాంటి తీర్పు రాకముందే పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఈ వివాదంపై ‘అఖండ-2’ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘త్వరలోనే అఖండ-2 సమస్యను పరిష్కారమవుతుంది. అవి అన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు కాబట్టి బయటకు వెల్లడించకూడదు.
ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. ‘అఖండ-2’పై ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. అన్ని కోట్లు చెల్లించాలట అని రాస్తెన్నారు. అవన్నీ అనవసరపు ప్రస్తావనలు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమాను విడుదల చేస్తాం. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి.
అభిమానులు నిరాశ చెందకండి.. అంచనాలను మించి ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా... ‘అఖండ’ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఇందులో హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా కనిపించనుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.






