‘మళ్ళీ పెళ్లి’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్..

by Disha Web Desk 13 |
‘మళ్ళీ పెళ్లి’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్..
X

దిశ, సినిమా: నరేష్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన మూవీని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మించగా మే 26న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్ పోస్టర్‌లో నరేష్, పవిత్రలు ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ కనిపించారు. ఇక జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషించిన చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి సినిమాకు సంగీతం అందించారు.


Next Story

Most Viewed