- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohan Babu: ఆ విషయాలు తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu Vishnu), ముఖేష్ కుమార్(Mukesh Kumar Singh) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu Vishnu), ముఖేష్ కుమార్(Mukesh Kumar Singh) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు, అక్షయ్ కుమార్(Akshay Kumar), శరత్ కుమార్, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, మోహన్ బాబ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ‘‘నా దృష్టిలో మా అమ్మనాన్నలు కన్నప్పలు.
మా అమ్మకు రెండు చెవులు వినిపించేవి కాదు. అయితే ఈ దేవుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు. టౌన్ నుంచి మా ఊరుకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఆ దారి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఒక కాలువ, నదిని దాటితే తప్ప మా ఊరుకు పోలేము. అయితే మా అమ్మ మా ఐదుగురిని మోసుకుంటూ ఆ దారిలోనే వెళ్లేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలు తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు.. ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా అని బాధపడేవాడిని. నాకు నా కన్నతల్లి కన్నప్ప’’ అని చెప్పుకొచ్చారు.






