SEX కు ఒప్పుకోలేదని సినిమా నుంచి తొలగించారు.. Isha Koppikar ఎమోషనల్

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-19 09:41:58  IST  )

బీ టౌన్ హాట్‌బ్యూటీ ఇషా కొప్పికర్ ఇండస్ట్రీలో అసౌకర్యానికి గురైన సందర్భాలను గుర్తుచేసుకుంది. ఈ సెప్టెంబర్ 19తో 46వ పడిలోకి అడుగుపెట్టిన నటి..Latest Telugu News

SEX కు ఒప్పుకోలేదని సినిమా నుంచి తొలగించారు.. Isha Koppikar ఎమోషనల్
X

దిశ, సినిమా: బీ టౌన్ హాట్‌బ్యూటీ ఇషా కొప్పికర్ ఇండస్ట్రీలో అసౌకర్యానికి గురైన సందర్భాలను గుర్తుచేసుకుంది. ఈ సెప్టెంబర్ 19తో 46వ పడిలోకి అడుగుపెట్టిన నటి.. తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయింది. తనకన్నా వయసులోనూ చాలా పెద్దవాడైన, ప్రముఖ నటుడు, నిర్మాత ఓ రోజు తనను ఒంటరిగా కలవాలని ఇబ్బంది పెట్టినట్లు చెప్పింది. కానీ తాను సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లడంతో కలవడానికి నిరాకరించిన ఆయన.. తాను చెప్పినట్లుగా చేయకపోవడంతో వెంటనే సినిమా నుంచి తొలగించాడని వెల్లడించింది.

ఇక ఆ సంఘటనతో మనసు ముక్కలైందన్న ఇషా.. ఇండస్ట్రీలో అందంగా ఉండటం ముఖ్యమైనప్పటికీ హీరోల లిస్ట్‌లో చేరడం మరింత ఇంపార్టెంట్ అని గమనించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరికి తమ తమ జీవితానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఉంటాయని, వృత్తిపరమైన నిబద్ధత కంటే లైఫ్‌లో నిజాయితిగా బతకడమే గొప్పగా భావిస్తానన్న ఆమె.. ప్రతిరోజు పడుకునే ముందు అద్దం వైపు చూసుకున్నప్పుడు మన మీద మనకు మంచి అనుభూతి కలగాలని అభిప్రాయపడింది.

Also Read : స్టార్ హీరోను చెప్పుతో కొడతా అన్న యంగ్ హీరోయిన్.. అక్కడ టచ్ చేయడంతోనేనా?

Next Story