విరూపాక్ష హీరోయిన్‌ తెలుగులో అవకాశాలను కోల్పోవడానికి కారణం ఇదేనా?

by Disha Web Desk 9 |
విరూపాక్ష హీరోయిన్‌ తెలుగులో అవకాశాలను కోల్పోవడానికి కారణం ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘విరూపాక్ష’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసారా, సార్’’ మూవీల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమెను టాలీవుడ్ పరిశ్రమలో అందరూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే సంయుక్తకు ఎందుకు అవకాశాలు రావట్లేదని తాజాగా అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా.. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ భామకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి కానీ తనే అవకాశాలను వదులుకుంటుందని టాక్ వినిపిస్తుంది. కథ ప్రాధాన్యత ఉన్న మూవీల్లో మాత్రమే నటించాలని ఆమెకు వచ్చిన సినిమా ఛాన్స్‌లను రిజెక్ట్ చేస్తోందట. ‘ఎంతో టాలెంట్ ఉన్న సంయుక్త కథ ఎంచుకోవడానికి ఆచితూచి అడుగు వేస్తుందంటూ’ నెటిజన్లు ఈ హీరోయిన్‌పై పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed