తూచ్.. మంచు బ్రదర్స్ గొడవ మొత్తం ఫ్రాంక్ వీడియోనా?

by Dishanational2 |
తూచ్.. మంచు బ్రదర్స్  గొడవ మొత్తం ఫ్రాంక్ వీడియోనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసిందే.మౌనిక, మనోజ్ పెళ్లి వార్తలు వస్తున్నప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ చాలా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, కొందరు వీటిని రూమర్స్ అని కొట్టి పారేస్తే మరికొందరు నిజమేనంటూ చెప్పుకొచ్చారు.

కాగా , మనోజ్ తన అన్న విష్ణుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేస్తూ గొడవలపై క్లారిటీ ఇచ్చాడు. మా అన్నయ్య కొట్టడానికి వస్తున్నాడంటూ, మనోజ్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో మొత్తం ఫ్రాంక్ అంటూ ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

తమ కుటుంబానికి దూర బంధువైన సారథి, తమకు సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటాడంట. దీంతో ఏదో చిన్న విషయంపై విష్ణు, సారధిని అడగడానికి వెళ్తే, ఆయన దానికి ఆన్సర్ చెప్పకపపోవడంతో, విష్ణుకు కోపం వచ్చి చెయ్యి ఎత్తాడంట. దీంతో అక్కడే ఉన్న విష్ణు ఆ సంఘటనను మొత్తం వీడియో షూట్ చేస్తూ ఇదిగో ఇలానే మా అన్న బంధువుల ఇంటికి వచ్చి అందర్నీ కొడుతాడంటూ తెలిపాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియో కొందరు నిజమంటే, మరికొందరు ఫ్రాంక్ వీడియో, మంచు బ్రదర్స్ నెటిజన్స్‌ను పిచ్చోళ్లను చేశారంటూ చెప్పుకొస్తున్నారు. కాగా, ఈ వీడియోపై ఇప్పటి వరకు మోహన్ బాబు స్పందించలే. ఇక ఆయన స్పందిస్తే కానీ ఈ వీడియోపై ఎలాంటి క్లారిటీ రాదంటున్నారు మంచు అభిమానులు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed