ఐశ్వర్య, ధనుష్‌కు విడాకులివ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమా?

by Disha Web Desk 9 |
ఐశ్వర్య, ధనుష్‌కు విడాకులివ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇంతటి సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపిన అనంతరం వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఇటీవలే డివోర్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరు ఎందుకు విడిపోయాన్నది జనాల్లో ఓ సందేహం ఉండేది. చాలా ఏళ్ల తర్వాత ఐశ్వర్య గురించి బయటపడిన ఓ నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో కుదిపేస్తోంది. అప్పట్లో రజనీ కుమార్తె స్టార్ కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమాయణం నడిపిందట.

వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడం, ఆ తర్వాత వీళ్ళ లవ్ బ్రేకప్ అవ్వడంతో, ఆ హీరోపై కోపంతోనే ధనుష్‌ను.. ఐశ్వర్య పెళ్లాడినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ‘ధనుష్‌కు, శింబుకు మొదటి నుంచే పడకపోవడానికి ఇదే కారణమా? అంటూ జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఆమె ధనుష్ ఇంట్లోనే ఉంటున్నారని గత వారం నుంచి వార్తలు హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed