పుష్ప 2’.. రాజమౌళి ఐడియాను ఫాలో అవుతున్న సుకుమార్

by Disha Web Desk 9 |
పుష్ప 2’.. రాజమౌళి ఐడియాను ఫాలో అవుతున్న సుకుమార్
X

దిశ, సినిమా: గతేడాది ‘పుష్ప’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్-సుకుమార్‌లు ఇప్పుడు ‘పుష్ప2’ పనుల్లో బిజిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఒక గ్లింప్స్ వీడియోను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో పుష్ప మిస్సింగ్ అంటూ చూపించారు సుకుమార్. అయితే ‘బాహుబలి’ మూవీ మొదటి భాగాన్ని కొండపై ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నతో రాజమౌళి ముగించారు. ఇది తెలుసుకునే కుతుహలంతో ప్రేక్షకులంతా ‘బాహుబలి 2’ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఇప్పుడు అచ్చం అలాగే సుకుమార్ కూడా ‘పుష్ప ఎక్కడ ఉన్నాడు?’ అంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించాడు. దీంతో రాజమౌళి ఐడియాను సుకుమార్ ఫాలో అవుతున్నాడని నెటిజన్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Hollywood : హాలీవుడ్ సినిమాకు జక్కన టెక్నికల్ సపోర్టు?

Next Story

Most Viewed