‘ఖుషి’ ప్రమోషన్స్‌కు చాలా కండీషన్స్ పెట్టిన సమంత?

by Dishanational2 |
‘ఖుషి’ ప్రమోషన్స్‌కు చాలా కండీషన్స్ పెట్టిన సమంత?
X

దిశ, సినిమా: స్టార్ హీరో మూవీ అయినప్పటికీ ప్రమోషన్స్ నిర్వహించపోతే జనాలు థియేటర్స్‌కు రావడం లేదు. అలాంటిది ఈ రోజుల్లో ఎలాంటి ప్రమెషన్ లేకుండా మూవీ హిట్ కావడం అంటే కష్టం అని చెప్పాలి. అయితే టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో ‘ఖుషీ’ కూడా ఒకటి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో ఆగస్టు సెకండ్ వీక్ నుంచి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మూవీ టీం. తాజా సమాచారం ప్రకారం నటి సమంత ఈ ప్రమోషన్స్ పాల్గొనాలంటే కొన్ని కండిషన్లు పెట్టిందట. ‘ఓన్లీ సినిమా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తాను. కానీ పబ్లిక్ ప్రమోషన్స్‌కు మాత్రం రాను. నాకు ఆసక్తి లేదు’ అని చెప్పిందట.

Read More: తెలుగులో రీ రిలీజ్‌‌కు రెడీ అయిన ‘రఘువరన్ B.Tech’

Next Story

Most Viewed