Pooja Hegde ఆరోగ్యం బాగోలేదా? అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదా?

by Disha Web Desk 9 |
Pooja Hegde ఆరోగ్యం బాగోలేదా? అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదా?
X

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు కలిసి రావడం లేదు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అన్నవారే ఇప్పుడు ఐరన్ లెగ్ అని విమర్శిస్తున్నారు. అయినా అవకాశాలు తలుపు తడుతున్నప్పటికీ.. కొత్తగా ప్రాజెక్ట్స్ కమిట్ అవడం లేదు. పైగా సైన్ చేసిన మూవీస్ నుంచి తప్పుకుంటుందని తెలుస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘గుంటూరు కారం’ వంటి ఈ రెండు సినిమాలు ఇందుకు నిదర్శనం. కాగా దాదాపు షూటింగ్‌లో పాల్గొన్నాక ఈ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. దీంతో అసలు పూజకి ఏమైంది? ఎందుకు అలా చేస్తుంది? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే తాజాగా పూజా హెగ్డే టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. నిజంగానే పూజ హెల్తీగా లేదని తెలిపింది. గత సినిమాల్లో నటించే టైమ్‌లో డ్యాన్స్ చేసేటప్పుడు తన కాళ్లకి గాయాలయ్యాయని.. దీంతో ఆమె మేజర్ సర్జరీ కూడా చేయించుకుందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని టాక్.

Next Story

Most Viewed