ఎన్టీఆర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా..నెట్టింట చర్చనీయాంశంగా మారిన వీడియో.. ఆందోళనలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌(NTR)కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా..నెట్టింట  చర్చనీయాంశంగా మారిన వీడియో.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌(NTR)కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన లుక్ చూసి అంతా ఆందోళన చెందుతున్నారు. అసలు ఆయనకు ఏమైంది.. ఏదైనా సినిమా కోసం అలా బక్కచిక్కిపోయారా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కోట శ్రీనివాస్ రావు‌ మృతి చెందడంతో నివాళులర్పించడానికి ఎన్టీఆర్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. కోట కుటుంబంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన లాంటి నటుడు మళ్లీ పుట్టరు అని అన్నారు.

చివర్లో అభిమానులు జై ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తే ఎన్టీఆర్ వాళ్ళని వారించి జై కోట అని నినాదం చేశారు. కొంతమంది ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించగా.. సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మొహంలో కళ లేకుండా నీరసంగా కనిపిస్తున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయనకు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందుతూ మెసేజ్‌లు పెడుతున్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ‘వార్-2’(war-2) మూవీలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ ‘డ్రాగన్’ రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

link

Next Story