ఇరుముడి సినిమాలో మాస్ మహారాజ్ డబుల్ రోల్ చేయనున్నాడా..?

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’(Irumudi).

ఇరుముడి సినిమాలో మాస్ మహారాజ్ డబుల్ రోల్ చేయనున్నాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’(Irumudi). శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక దీనికి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందట.

ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట షికారు చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా కథ, కథనం, పాత్రల చిత్రణ వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ ప్లే చేయనున్నారట. అయితే రెండూ పాత్రలు చేయడం రవితేజకు కొత్తేం కాదు. ఇప్పటికే చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే.. ఈ పాత్రల్లోని వేరియేషన్స్‌ మాత్రం చాలా బాగా కుదిరాయని టాక్‌ వినిపిస్తున్నది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story