మంచు బ్రదర్స్ దాని కోసమే కొట్టుకుంటున్నారా?

by Disha Web Desk 6 |
మంచు బ్రదర్స్ దాని కోసమే కొట్టుకుంటున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: మంచు బ్రదర్స్ మధ్య ఏవో విభేదాలున్నాయని గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం సోషల్ మీడియాలో మంచు మనోజ్ షేర్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. మార్చి 24న మంచు మనోజ్ సన్నిహితుడైన సారథి అనే వ్యక్తితో మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మంచు ఫ్యామిలీలోని గొడవలు బయటపడ్డాయి. దీంతో అసలు మంచు బ్రదర్స్ మధ్య గొడవకు కారణం ఏంటనే చర్చ ఊపందుకుంది.

మంచు బ్రదర్స్ గొడవలకు కారణం ఆస్తి విషయంలో మనోజ్‌కు దక్కాల్సిన ఆస్తిని విష్ణు దక్కకుండా చేస్తున్నాడట. అందుకే కుటుంబంలో గొడవలు వచ్చి విష్ణు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఒక ల్యాండ్ గురించి మంచు బ్రదర్స్ కొట్టుకుంటున్నారట. అయితే వీరిద్దరి మధ్య మంచు మెహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన సారథి మనోజ్‌కు సపోర్ట్‌గా ఉండటం వల్లే విష్ణుకు కోపం వచ్చి ఆయనపై దాడి చేశాడని టాక్.

Also Read..

ఆస్కార్ ఫంక్షన్ లో రాజమౌళి వెనుక సీటులో కూర్చోవడానికి కారణమిదే!

Next Story

Most Viewed