- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్ చూపించినంత మాత్రాన తప్పు చేసినట్టేనా.. హాట్ టాపిక్‌గా మంచు లక్ష్మి కామెంట్స్
మంచు లక్ష్మి (manchu laxshmi)చాలా రోజుల తర్వాత ‘దక్ష’ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం పెద్దగా అందుకోలేకపోయింది.

దిశ, సినిమా: మంచు లక్ష్మి (manchu laxshmi)చాలా రోజుల తర్వాత ‘దక్ష’ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం పెద్దగా అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తమ కుటుంబ విషయాలను, పర్సనల్ లైఫ్ గురించి రివీల్ చేస్తోంది. తాజాగా, ‘ది మేల్ ఫెమినిస్ట్’(The Male Feminist) పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో యాంకర్ మీరు స్టార్ కిడ్ కాబట్టి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు రాలేదనుకుంటా?అని అడగ్గా.. దానికి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘‘అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. నేను కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. కానీ నా కుటుంబం, నాన్న పేరు కారణంగా కొంతవరకు దూరంగా ఉండేవి అంతే.
కానీ కొన్ని సంఘటనలు నేను విన్నప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునేదాన్ని. కాస్టింగ్ కౌచ్ గురించి తెలుసుకున్న తర్వాత ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. కొన్ని కథలు నిజంగా హృదయాన్ని పిండేశాయి’’ అని చెప్పుకొచ్చింది. అలాగే సౌత్, నార్త్ ఇండియా ఇండస్ట్రీల్లోని కల్చర్ మధ్య ఉండే తేడాల గురించి.. కొన్ని సినిమాల్లో బొడ్డు చూపిస్తే పెద్ద తప్పు చేసినట్టేనా అది ఒక ఆర్ట్‌లా చూడాలి. లుక్‌ని ఇంకా అద్భుతం చేస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ మన సమాజం మహిళల శరీరాన్ని వేరేలా చూస్తున్నారు. సౌత్‌లో మహిళలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నార్త్‌లో అలా ఉండదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






