‘లాల్ సింగ్ చద్దా’ డిజాస్టర్ కావడం వల్లే హిందీలో సినిమాలు చేయట్లేదా?.. నాగచైతన్య సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నేను హిందీలో సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.

‘లాల్ సింగ్ చద్దా’ డిజాస్టర్ కావడం వల్లే హిందీలో సినిమాలు చేయట్లేదా?.. నాగచైతన్య  సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘వృషకర్మ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న చైతు, హిందీ చిత్రాలకు మాత్రం దూరంగా ఉంటుండటంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆయన నటించిన మొదటి హిందీ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడమే దీనికి కారణమని, ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్లే చైతు బాలీవుడ్ జోలికి పోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా ఈ విమర్శలపై నాగచైతన్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హిందీ సినిమాలు చేయకపోవడానికి 'లాల్ సింగ్ చద్దా' ఫలితం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. "నేను హిందీలో సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.

కేవలం తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే హిందీ చిత్రాలకు సమయం కేటాయించలేకపోయాను. అంతకు మించి బయట వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు" అని చైతు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో మంచి స్క్రిప్ట్, ఆసక్తికరమైన అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ హిందీ సినిమాలు చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం అనుభవాల గురించి మాట్లాడుతూ.. ఆ మూవీ షూటింగ్ సమయంలో తాను ఎంతో ఎంజాయ్ చేశానని, అక్కడి జనం దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఆమిర్ ఖాన్ టీమ్ తనను చాలా గౌరవంగా చూసుకున్నారని, ఆ అనుభవం మాటల్లో చెప్పలేనని అన్నారు. బాక్సాఫీస్ వద్ద విజయాలు, అపజయాలు సహజమని, వాటిని తట్టుకునే పరిణతి తమకు ఉందని చైతు పేర్కొన్నారు. ఫలితాలు ఎప్పుడూ తన లక్ష్య సాధనను అడ్డుకోలేవని, కేవలం కథ నచ్చితేనే ఏ భాషలోనైనా సినిమా చేస్తానని అక్కినేని హీరో కుండబద్దలు కొట్టారు.

Next Story