Super star krishna చనిపోవడానికి.. డైరెక్టర్ తివిక్రమే కారణమా?

by samatah |   (  Updated:2022-11-16 10:24:54  IST  )

తమ వీరాభిమాని చనిపోయాడని తెలిసిన తర్వాత, ఎవరో ఒకరు సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఫ్యాన్స్‌కు అలావాటై పోయింది.

Super star krishna చనిపోవడానికి.. డైరెక్టర్ తివిక్రమే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ వీరాభిమాని చనిపోయాడని తెలిసిన తర్వాత, ఎవరో ఒకరు సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఫ్యాన్స్‌కు అలావాటై పోయింది. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి, ఇది మరీ ఎక్కువైపోయిందని చెప్పాలి. ఎందుకంటే, సూపర్ స్టార్, సీనియర్ హీరో గుండెపోటుతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈయన మరణ వార్త, విన్న తమ అభిమానులు, ఓ కొత్త వార్తకు తెర లేపారు.

కృష్ణ చనిపోవడానికి అసలు కారణం మాటల మాంత్రికుడు తివిక్రమే అంటూ సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నారు. అసలు ఇందులో అసలు లాజిక్ ఏంటో తెలుసా? అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తు్న్న సమయంలో, పవన్ తండ్రి కొణిదెల వెంకటరావు మృతి చెందారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత సినిమా చేస్తున్న సమయంలో, ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా తీస్తున్న టైంలో కృష్ణ చనిపోయాడు. ఇదంతా తివిక్రం వలనే, ఆయనే సీనియర్ హీరోల తండ్రులను పొట్టన పెట్టుకున్నాడంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇక ఈ లాజిక్ విన్న కొందరు నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి: అఖిల్‌ కనిపిస్తే నలిపేస్తా.. హాట్ కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ

Next Story