‘Dealer of Death’.. ‘జవాన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by Disha Web Desk 10 |
‘Dealer of Death’.. ‘జవాన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్‌, అట్లీ కాంబోలో వస్తున్న ‘జవాన్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వెలువడింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తున్న మూవీలో.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా మూవీనుంచి విజయ్‌ సేతుపతి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ.. ‘DEALER OF DEATH’ క్యాప్షన్‌తో తాజా లుక్‌ షేర్ చేశారు మేకర్స్. ఈ మేరకు బ్లాక్ స్టైలిష్ గాగుల్స్‌తో అట్రాక్టింగ్‌గా కనిపిస్తున్న విజయ్ లుక్‌ ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన టైటిల్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుండగా.. యాక్షన్‌ థ్రిల్లర్‌‌లో షారుఖ్‌ తండ్రి, కొడుకుగా డ్యుయల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్‌కానుంది.



Next Story

Most Viewed