'సూపర్ సెక్స్'.. 1300 పోర్న్ సినిమాలు చేసిన వ్యక్తితో..

by Disha Web Desk 21 |
సూపర్ సెక్స్.. 1300 పోర్న్ సినిమాలు చేసిన వ్యక్తితో..
X

దిశ, సినిమా : పోర్న్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రోకో సిఫ్రెడి జీవితకథ ఆధారంగా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోంది నెట్‌ఫ్లిక్స్. 'ఇటాలియన్ స్టాలియన్'గా గుర్తింపు పొందిన ఆయన సెక్స్‌ అడిక్షన్‌‌తో చేసిన పోరాటం.. ఈ ప్రాజెక్ట్‌కు ఇన్‌స్పిరేషన్ కాగా ప్రసిద్ధ ఇటాలియన్ స్క్రీన్ రైటర్ ఫ్రాన్సిస్కా మనీరీ కథను డెవలప్ చేశారు. అడల్ట్ ఫిల్మ్ సిరీస్ 'బటమాన్'తో పాపులర్ అయిన అలెశాండ్రో బోర్గీ.. రోకో పాత్రలో కనిపించబోతున్నారు.

దాదాపు 1300కు పైగా అశ్లీల సినిమాలు చేసిన రోకో ప్రేమను కోరుకున్నాడని, తనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్న మేకర్స్.. మునుపెన్నడూ లేని విధంగా పోర్న్ పరిశ్రమ, పోర్న్ స్టార్స్‌కు సంబంధించిన అంతర్గత వీక్షణను తెరకెక్కించబోతున్నారు. కుటుంబ చరిత్ర, శృంగార సంబంధాలు, పోర్న్ ఇండస్ట్రీ ప్రయాణంతో పాటు అనుకోని విధంగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘటనలను 'సూపర్ సెక్స్' సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్ వ్యవధి 350 నిమిషాల ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

50 ఏళ్లలో నగ్నంగా నటి ఫొటోషూట్.. ఎందుకో చెప్తోంది!

మాల్‌లో నటీమణులకు లైంగిక వేధింపులు

Next Story