యశోద మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ సీన్ రిలీజ్

by Disha Web Desk 21 |
యశోద మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ సీన్ రిలీజ్
X

దిశ, సినిమా : సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' చిత్రం ఈ శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కథ మొత్తం సమంత చుట్టూ తిరుగుతుందనే విషయం రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సుమారు రూ. 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ముందుగా రూ. 3 కోట్లతో ప్లాన్ చేసినప్పటికీ, సమంత స్క్రిప్ట్ విని ఓకే చెప్పిన తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినట్లు తెలిపారు. ఇక రీసెంట్‌గా మూవీ నుంచి మూడు నిమిషాల సీన్ రిలీజ్ చేయగా.. ఇదే సీన్‌తో కథ మలుపు తిరుగుతుందన్నట్లుగా చూపించారు. మరోవైపు ఈ క్లిప్‌ చూసిన అభిమానులు 'మూవీ పక్కా బ్లాక్ బాస్టర్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed