- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవమానాలు నాకు కొత్తేమీ కాదు.. దేశద్రోహి అన్నా పోరాటం ఆపనంటూ ట్రోలర్స్‌కు రష్మీ స్ట్రాంగ్ కౌంటర్
నన్ను విమర్శించడం మీకు కొత్త కావొచ్చు, కానీ నాకు కాదు. గతంలో పండుగల్లో జంతువులను బలి ఇవ్వొద్దంటే తిట్టారు.

దిశ, సినిమా: మూగజీవాల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూనే, వాటిపై జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంలో రష్మీ గౌతమ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా, రాజకీయ నాయకులు నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో ఎడ్లను హింసించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో ఒక వినూత్న ర్యాలీ చేపట్టారు. పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పడానికి ఒక ఆటోను ఎడ్ల బండిపై ఉంచి ప్రదర్శించారు. ఈ ఫోటోలు చూసిన రష్మీ వెంటనే స్పందించారు. "మీ రాజకీయ ప్రచారం కోసం ఆ నోరు లేని మూగజీవాలపై అంత బరువు వేస్తారా? ఇది పక్కాగా జంతు హింసే" అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. రష్మీ పోస్ట్‌పై కొందరు రాజకీయ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. దీనిపై రష్మీ ఎక్కడా భయపడకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "నన్ను విమర్శించడం మీకు కొత్త కావొచ్చు, కానీ నాకు కాదు. గతంలో పండుగల్లో జంతువులను బలి ఇవ్వొద్దంటే తిట్టారు. ఏనుగుల చర్మాన్ని అంకుశంతో చీలుస్తుంటే ప్రశ్నించినందుకు నన్ను దేశద్రోహి అని కూడా ముద్ర వేశారు.
అయినా సరే నేను నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను. నా పోరాటాన్ని ఆపను" అని కుండబద్దలు కొట్టారు. ప్రజలు సమస్యను పరిష్కరించడం మానేసి, ఒక తప్పును మరో తప్పుతో పోలుస్తూ తప్పించుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఒక జంతువు గురించి మాట్లాడితే మనుషుల గురించి మాట్లాడరేంటి అని కొందరు, వేరే జంతువుల గురించి మాట్లాడరేంటి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. "నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం, వాటి రక్షణ కోసం చట్టాలు చేసి చిత్తశుద్ధితో పనిచేస్తుందో.. ఆ పార్టీకి నేను బహిరంగంగా మద్దతు ఇస్తాను" అని రష్మీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని ఎండగట్టడంలో రష్మీ చూపిస్తున్న ఈ తెగింపుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను నిజమైన యానిమల్ లవర్ అని పొగుడుతుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.






