- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్యం కోసం పోరాడే యోధురాలిగా అనన్య నాగళ్ల.. ‘ది బ్రేకింగ్ న్యూస్’ పోస్టర్‌తో భారీ హైప్
వ్యవస్థలో చిక్కుకున్నా, అడ్డంకులను ఛేదించి సత్యాన్ని బయటపెట్టే ఒక జర్నలిస్టుగా ఆమె ఈ సినిమాలో కనిపిస్తోందని అర్థమవుతోంది.

దిశ, సినిమా: మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఇండప్ట్రీకి పరిచయమై, తన సహజమైన నటనతో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల. పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ, ప్రస్తుతం విభిన్నమైన కథాంశాలతో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె నటిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘ది బ్రేకింగ్ న్యూస్’ నుండి ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మీడియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ‘అరుణ’ అనే ఒక తీవ్రమైన, ఉద్వేగభరితమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా, విడుదలైన పోస్టర్‌లో అనన్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఒక పంజరం లాంటి నిర్మాణంలో బందీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పంజరం న్యూస్ ఛానల్ మైక్‌ను పోలి ఉండటం, దానిపై NEWS అని రాసి ఉండటం కథలోని తీవ్రతను సూచిస్తోంది.
వ్యవస్థలో చిక్కుకున్నా, అడ్డంకులను ఛేదించి సత్యాన్ని బయటపెట్టే ఒక జర్నలిస్టుగా ఆమె ఈ సినిమాలో కనిపిస్తోందని అర్థమవుతోంది. పవన్ కడియాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమా పోస్టర్‌కు జోడించిన క్యాప్షన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. "సత్యం బంధించబడినప్పుడు... దాన్ని విముక్తం చేసేదెవరు? కొన్ని గొంతులు అణచివేయబడవచ్చు... కానీ ఆమె గొంతు సత్యాన్నే కదిలించివేస్తుంది" అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. అరుణ అనే పాత్ర సమాజంలోని కుట్రలను, అబద్ధాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఈ సినిమాలో ప్రధానాంశంగా ఉండబోతోంది. విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. కాగా.. ప్రస్తుతం అనన్య ‘సంబరాల ఏటిగట్టు’, ‘లీసా’ వంటి సినిమాలతో పాటు హిందీ ప్రాజెక్టుల్లోనూ బిజీగా ఉంది. అయితే ‘ది బ్రేకింగ్ న్యూస్’ ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.






