డైరెక్టర్‌ను అవమానించడం కరెక్ట్ కాదు.. రజినీకాంత్‌పై మొదలైన ట్రోల్స్

by Disha Web Desk 7 |
డైరెక్టర్‌ను అవమానించడం కరెక్ట్ కాదు.. రజినీకాంత్‌పై మొదలైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీ కాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘జైలర్’. ఈ మూవీ ఆగస్టు 9న రిలీజై బాక్సాఫీస్ వద్దా భారీ కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సినిమా యూటిన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ఆసశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజం చెప్పాలంటే జైలర్ సినిమా నాకు కూడా ఎబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ, రీ రికార్డింగ్ మొత్తం అయ్యాక అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా ఎక్కిడికో వెళ్లిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు సూపర్ స్టార్. సినిమా బ్లాక్ బస్టర్ అయినా.. తాను ఎబోవ్ యావరేజ్ అనిపించిందని నిజం చెప్పాడంటూ కొంత మంది రజినీ సింప్లిసిటీని పొగుడుతుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్‌ను అలా అవమానిస్తారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed