పనికిమాలిన కామెంట్లు పెట్టే బదులు ఏదైనా పని చూసుకోండిరా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్ (పోస్ట్)

by Mallepaka Hamsa |

అన్షు అంబానీ(Anshu Ambani) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘మన్మథుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

పనికిమాలిన కామెంట్లు పెట్టే బదులు ఏదైనా పని చూసుకోండిరా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్ (పోస్ట్)
X

దిశ, సినిమా: అన్షు అంబానీ(Anshu Ambani) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘మన్మథుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్(Prabhas), శివాజీలతో నటించి మెప్పించింది. అయినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో యూకే చెక్కేసింది. ఇక 2011లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వీరికి ఓ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత అన్షు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ మూవీలో కీలక పాత్రలో నటించింది కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

ఇక ఆమె ఫొటోలు చూసిన నెటిజన్లు ఇద్దరు పిల్లల తల్లివి ఇవన్నీ అవసరమా అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, అన్షు అంబానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లకు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది. ‘‘ఇద్దరు పిల్లల తల్లివి కాస్త పద్ధతిగా ప్రవర్తించు.. 20 ఏళ్ల పిల్లవి అనుకుంటున్నావా ఏంటి. సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు బక్కగా ఉన్నావు. ఇలాంటి పనికిమాలిన కామెంట్లు పెట్టే బదులు వేరే ఏదైనా పని చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మీరు ఎలాంటి వాళ్లో అర్ధమవుతోంది. అవును నాకు ముడతలు ఉన్నాయి.

నేను సర్జరీ చేయించుకున్నాను అని తిడుతున్నారు కదా.. ఇప్పటివరకు నేను ఏ సర్జరీలు చేయించుకోలేదు. ఫిల్లర్స్ కూడా పెట్టించుకోలేదు. బొద్దుగా ఉన్నప్పుడు నాకే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు బాగానే ఉన్నాను. జీవితంలో ఏం చేయడానికైనా టైమ్ అంటూ లేదు. కలలు కనండి.. మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. హేటర్స్ అలాగే అంటారు పట్టించుకోకని కామెంట్లు పెడుతున్నారు.

Next Story