వేలికి సిరా గుర్తు.. విజయ్ సినిమా పాట! సంచలనంగా మారిన త్రిష పోస్ట్

by Mallepaka Hamsa |

త్రిష ఈ ఫోటోకు జత చేసిన పాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్రిష తన పోస్ట్‌కు విజయ్‌తో తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘గిల్లి’లోని ‘అర్జునర్ విల్లు’ అనే సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టింది.

వేలికి సిరా గుర్తు.. విజయ్ సినిమా పాట!  సంచలనంగా మారిన త్రిష పోస్ట్
X

దిశ, సినిమా: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న త్రిష, దళపతి విజయ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. గతంలో వీరిద్దరూ కలిసి ఒక పెళ్లి వేడుకలో క్లోజ్‌గా కనిపించడం, ఆ ఫోటోలు వైరల్ కావడంతో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారనే వరకు ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలపై అటు విజయ్ కానీ, ఇటు త్రిష కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తాజాగా తమిళనాడు ఎన్నికల సందర్భంగా త్రిష పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో త్రిష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం తన వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఓటు వేయమని చెప్పడం సహజమే, కానీ త్రిష ఈ ఫోటోకు జత చేసిన పాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్రిష తన పోస్ట్‌కు విజయ్‌తో తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘గిల్లి’లోని ‘అర్జునర్ విల్లు’ అనే సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టింది.

ఇందులో రెండు ముఖ్యమైన విషయాలను నెటిజన్లు గమనిస్తున్నారు. విజయ్-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన సాంగ్ ఇది. ఈ పాటను ఎంచుకోవడం ద్వారా ఆమె తన మద్దతు విజయ్‌కే అని ఇండైరెక్ట్‌గా చెప్పిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ గుర్తుకు దగ్గరగా ఉండేలా, ఆ పాటలో వచ్చే 'విజిల్' శబ్దానికి ప్రాధాన్యతనిస్తూ త్రిష ఈ ఆడియోను ఎంపిక చేసుకుంది. ఈ క్రేజీ హింట్స్‌తో ఆమె విజయ్ పార్టీకే ఓటు వేయాలని తన ఫాలోవర్లకు సంకేతాలు పంపిందని చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వస్తున్న రూమర్లకు, త్రిష చేసిన ఈ పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చింది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన కీలక సమయంలో, త్రిష ఇలా ఆయన సినిమా పాటను పెట్టి సపోర్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్ తమిళనాట పొలిటికల్,సినీ సర్కిల్స్‌లో సెన్సేషన్‌గా మారింది. త్రిష నేరుగా చెప్పకపోయినా, విజయ్ పట్ల తనకున్న అభిమానాన్ని, మద్దతును ఇలా విభిన్నంగా చాటుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story