- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదట పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు ఆయనతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది: నాని
నేచురల్ స్టార్ నాని(nani) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు ఓ స్టార్ హీరో మెసేజ్ చేసినప్పటికీ పట్టించుకోలేదని.. కానీ ఆ తర్వాత మర్చిపోలేని అనుభవం ఎదురైనట్లు చెప్పాడు. చియాన్ విక్రమ్(Chiyaan Vikram) మాటలకు తాను ఫిదా అయిపోయినట్లు వారిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను వెల్లడించాడు. ‘‘కొన్ని నెలల క్రితం, నాకు ఒక గుర్తు తెలియని నంబర్ నుండి 'విక్రమ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు' అని ఒక మెసేజ్ వచ్చింది. అది గుర్తు తెలియని నంబర్ నుండి వచ్చినందున నేను ఆ మెసేజ్‌ను పట్టించుకోలేదు. మరుసటి రోజు, "హాయ్ నాని, నేను చియాన్ విక్రమ్‌ని ఇక్కడ" అని మెసేజ్ వచ్చింది.
వెంటనే నేను నా మేనేజర్‌తో ఆ నంబర్‌ను సరిచూసుకుని కాల్ చేశాను. విక్రమ్ గారు కాల్ మాట్లాడి నాతో 10-15 నిమిషాలు మాట్లాడారు. మీరు నమ్మరు, ఆయన కేవలం నా గురించి, నా సినిమాల గురించే మాట్లాడారు. తాను నాకు పెద్ద అభిమానినని, నా కెరీర్ ప్రారంభం నుంచే నా పనులను అనుసరిస్తున్నానని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. ఆయన నా గురించి, నా కుటుంబం గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయనతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. దాని గురించి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా.. నాని సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘హిట్-3’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రజెంట్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సూపర్ హిట్‌గా నిలవడంతో.. రెండు ప్రాజెక్ట్‌పై ఆంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కయాదు లోహర్ నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ & స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతుంది.






