బోల్డ్ మూవీకి ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

by Disha Web Desk 10 |
బోల్డ్ మూవీకి ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?
X

దిశ, సినిమా: డైరెక్టర్ అజయ్ భూపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతనికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్జీవీ శిష్యుడు కావడంతో అజయ్ తీసే సినిమాలపై వర్మ ప్రభావం కూడా కనిపిస్తుంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో పెద్డ విజయం అందుకున్నాడు. ఆ మూవీలో ఇంత వరకు ఎవరు చూపించని క్లైమాక్స్ చూపించి అందరినీ షాక్ కి గురి చేసాడు.

అంత పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మహా సముద్రం లాంటి సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. అది ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత, తనకి బాగా కలిసి వచ్చిన పాయల్ రాజ్‌పుత్‌తో మంగళవారం అనే మూవీని తీసాడు. ఈ సినిమా మిక్సడ్ టాక్ తో బాగానే ఆడింది. కానీ, చాలా మంది బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు చేసారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాకే అవార్డు దక్కింది.

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం సినిమాకి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకోనున్నారు. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ అతన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అజయ్ భూపతి జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. పాయల్ రాజ్‌పుత్, ప్రియదర్శి జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.



Next Story

Most Viewed