ఇండియన్ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు.. ఆస్కార్ బరిలో కాంతార, మహావతార్ నరసింహ

by Mallepaka Hamsa |

భారతీయ సినిమాలు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు.. ఆస్కార్ బరిలో కాంతార, మహావతార్ నరసింహ
X

దిశ, సినిమా: భారతీయ సినిమాలు మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయి. ఆస్కార్ 2026 రేసులో మన దేశానికి చెందిన చిత్రాలు కీలకమైన జనరల్ ఎంట్రీ (Eligibility List)లో చోటు దక్కించుకోవడం సినీ అభిమానులను గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది. ఈ జాబితాలో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’(Kantara: A Legend – Chapter 1)తో పాటు, భారతీయ యానిమేషన్ రంగంలో సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narasimha)చోటు సంపాదించుకోవడం విశేషంగా మారింది. రిషబ్ శెట్టి(Rishab Shetty) దర్శకత్వం వహిస్తూ, నటించిన ‘కాంతార’ చిత్రం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భూమి–మనిషి మధ్య ఉన్న లోతైన అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

బెస్ట్ ఫిలిం

ఇక ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ ఇప్పుడు ఆస్కార్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ పిక్చర్’ విభాగానికి అర్హత సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 201 ఫీచర్ ఫిల్మ్స్‌లో ఈ చిత్రం ఒకటిగా నిలవడంతో సినీ ప్రియులంతా భారతీయ సినీ పరిశ్రమకు గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఈ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో చోటు దక్కడం వల్ల, బెస్ట్ పిక్చర్‌తో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, అలాగే సాంకేతిక విభాగాల వంటి ప్రధాన కేటగిరీల్లోనూ ఈ చిత్రం పోటీ పడే అవకాశం లభించిందని సమాచారం.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

దీంతో పాటు ..భారతీయ యానిమేషన్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘మహావతార్ నరసింహ’ కూడా ఆస్కార్ రేసులో చోటు సంపాదించడం విశేషంగా మారింది. ఆస్కార్‌లోని ‘బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో పోటీ పడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 యానిమేటెడ్ చిత్రాలతో ఈ సినిమా పోటీకి దిగనుందట. ముఖ్యంగా, ఒక భారతీయ యానిమేటెడ్ చిత్రం ఈ స్థాయిలో ఆస్కార్ రేసులో నిలవడం ఇదే తొలిసారి కావడం మరింత విశేషం. ఇవే కాకుండా, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ‘తన్వీ ది గ్రేట్’ కూడా బెస్ట్ పిక్చర్ రేసులో ఉండటం మరో ప్రత్యేక విశేషం.

Next Story