- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న‘డియర్ ఉమ’ సినిమా పోస్టర్
తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకే సారి ఒక సినిమాకు పని చేయడం అంటే మామూలు విషయం కాదు.

దిశ, సినిమా: తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకే సారి ఒక సినిమాకు పని చేయడం అంటే మామూలు విషయం కాదు. అనంతపురం నుంచి వచ్చిన అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగమ్మాయి సుమయా రెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీగా ఉంది. నిర్మాతగా, హీరోయిన్‌గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ చిత్రంతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సుమయా రెడ్డి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇలా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు. నిర్మాతగా సుమయా రెడ్డికి ఇది మొదటి చిత్రమే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి రధన్ సంగీతమందించారు.






