ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్.. ఏ పాత్రలో కనిపించబోతున్నాడంటే?

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇప్పటికే ఆయన తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను కూడా సైలెంట్‌గా పూర్తి చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ  ‘మహాకాళి’ సినిమాలో  రెబల్ స్టార్ ప్రభాస్.. ఏ పాత్రలో కనిపించబోతున్నాడంటే?
X

దిశ, సినిమా: హనుమాన్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. అదే ‘మహాకాళి’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇప్పటికే ఆయన తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను కూడా సైలెంట్‌గా పూర్తి చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ప్రశాంత్ వర్మ మార్క్ మేకింగ్‌లో ప్రభాస్ ఎలా కనిపిస్తారా అని అభిమానులు ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రశాంత్ వర్మ కథను అందిస్తూ, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి ‘ఫీమేల్ సూపర్ హీరో’ చిత్రంగా ‘మహాకాళి’ రాబోతుంది. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కన్నడ బ్యూటీ భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్యుడు’ అనే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘హనుమాన్’ తర్వాత వస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Next Story