- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జున రాబోయే మూవీలో.. అల్లరి నరేష్ కీలక పాత్ర
అల్లరి నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అయితే రొటీన్ కామెడీ తో సినిమాలు చేస్తుండటంతో ఇతనికి ఫెయిల్యూర్ కూడా ఎదురయ్యింది.

X
దిశ, సినిమా: అల్లరి నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అయితే రొటీన్ కామెడీ తో సినిమాలు చేస్తుండటంతో ఇతనికి ఫెయిల్యూర్ కూడా ఎదురయ్యింది. దీంతో అల్లరి నరేష్ కామెడీ సినిమాలు పక్కనపెట్టి, సీరియస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో మెప్పించిన ఈ యాక్టర్. ఈ క్రమంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించబోయే తర్వాతి మూవీలో ఓ కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించబోతున్నట్లు తెలిసింది. కింగ్ మూవీలోని ఈ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుందని, సినిమా కథలో ఇది చాలా కీలకం అని, సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీని గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






