- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందమైన ఫిగర్ నువ్వా.. డే టైమ్‌లో డెవిల్ నువ్వా సాంగ్ రిలీజ్.. ఆ హీరోయిన్‌ను ఆడేసుకుంటున్న నాగశౌర్య
నాగ శౌర్య (Naga Shaurya) నటిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik)సినిమా నుంచి అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: నాగ శౌర్య (Naga Shaurya) నటిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik)సినిమా నుంచి అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్ లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది. అక్కడక్కడా తెలంగాణ భాషను ఉపయోగించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా(Ram Desina) (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.






