'లియో' కి సంబంధించి కీలక అప్‌డేట్...!

by Disha Web Desk 1 |
లియో కి సంబంధించి కీలక అప్‌డేట్...!
X

దిశ, వెబ్ డెస్క్: విక్రమ్ ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్, తలపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి 'లియో' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు.విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 1, 2023 నుంచి ప్రారంభం కానుంది.

నెల రోజుల పాటు నిర్విరామంగా షెడ్యూల్ జరగనుందని విజయ్, త్రిష, సంజయ్ దత్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ చెన్నైలో జరగనుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.



Next Story

Most Viewed