- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నా పిల్లలతో గడపాలని ఆశపడుతున్నాను.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్.. శోభిత తల్లి కాబోతుందా?
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య, శోభిత(Sobhita Dhulipala)తో డేటింగ్ చేశాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ బిగ్ షాకిచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య వరుస సినిమాల్లో నటిస్తుండగా.. శోభిత మాత్రం ఇండస్ట్రీకి దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. నాగచైతన్య కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, చైతు తన కోరికను బయట పెట్టాడు. ‘‘నాకంటూ పెద్ద కోరికలు ఏమీ లేవు.
50 ఏళ్లు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరో, ఇద్దరో పిల్లలు కావాలనుకుంటున్నాను. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తాను. అదే కూతురు పుడితే మాత్రం తన ఇష్టాలను గౌరవించి తనకు నచ్చింది చేసేలా ప్రోత్సహిస్తాను. పిల్లలతో సమయం గడపాలని ఉంది. చిన్నప్పుడు నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు నా పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శోభిత తల్లి కాబోతుందా? అందుకే చైతు ఇలాంటి కామెంట్స్ చేశాడని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదైతేనేం నాగచైతన్య కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






