చాలా రోజుల తర్వాత ఎక్సైటింగ్ ప్రాజెక్టుతో వస్తున్నా..

by Mallepaka Hamsa |

బాబీ సింహా(Bobby Simha), హెబ్బా పటేల్ (Hebba Patel)హీరో, హీరోయిన్‌గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది.

చాలా రోజుల తర్వాత ఎక్సైటింగ్ ప్రాజెక్టుతో వస్తున్నా..
X

దిశ, సినిమా: బాబీ సింహా(Bobby Simha), హెబ్బా పటేల్ (Hebba Patel)హీరో, హీరోయిన్‌గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు. ఈసందర్భంగా.. నిర్మాత యువకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కథలు విన్నాను. నటనకి చాలా మంచి స్కోప్ ఉన్న కథ, ఈ కథ వినగానే మొదట నాకు బాబీ సింహ గారే గుర్తొచ్చారు. ఆయన్ని సంప్రదిస్తే అప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. కథ ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేద్దామని ఆయన చెప్పడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కథకు కావలసింది ప్రతిదీ సమకూర్చి ఒక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రాబోతున్నామని అన్నారు.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత నాకు మంచి ఎక్సైటింగ్ ప్రాజెక్టు వచ్చింది. సూర్యతో కలిసి పని చేయడం ఇది రెండోసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యు. బాబీ సింహ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని చెప్పింది. అనంతరం హీరో బాబీ సింహ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యువ దగ్గరినుంచి కాల్ వచ్చింది స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా నచ్చింది. ఒక యాక్టర్‌ని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. నా కెరియర్‌లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. హెబ్బా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. తనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 22 నుంచి వైజాగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్‌ను కోరారు.

Next Story