హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్.. పెళ్లికిముందే అలా చేస్తూ

by Disha Web Desk 6 |
హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్.. పెళ్లికిముందే అలా చేస్తూ
X

దిశ, సినిమా : స్మార్ట్ బ్యూటీ ఇలియానా మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. మొదటి బాయ్‌ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌కు ఇటీవలే బ్రేకప్ చెప్పేసిన నటి తాజాగా కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇటీవల 'కాఫీ విత్ కరణ్ షో'కు హాజరైన కత్రినను ఇలియానాతో మీ సోదరుడు సెబాస్టియన్ రిలేషన్‌లో ఉన్నారా? అని హోస్ట్ ప్రశ్నించగా.. నోటితో చెప్పకపోయినా నొసటితో అవును అన్నట్లే సమాధానం ఇచ్చింది.

దీంతో కన్‌ఫర్మ్ చేసుకున్న నెటిజన్లు నెట్టింట రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు కత్రినా, విక్కీతో కలిసి వీళ్లిద్దరూ మాల్దీవ్స్‌కు విహారయాత్రకు వెళ్లడం, అక్కడ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు కూడా నెట్టింట తెగ హల్ చల్ చేయగా.. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్‌లో కలిసే ఉంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : సమంత రెండో పెళ్లి.. ఆ వ్యక్తి ఎవరంటే?


పెళ్లి కాకపోతే పిల్లలను కనొద్దని రూల్ ఉందా? : స్టార్ హీరోయిన్ Tabu



Next Story

Most Viewed