- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి బట్టలు వేసుకుంటే ఎదుటివారితో మాటలు పడాల్సిందే.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇంద్రజ (Indraja)ఒకరు.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇంద్రజ (Indraja)ఒకరు. ఒకప్పడు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. చాలా రోజుల తర్వాత బుల్లితెరపై పలు షోస్ చేస్తూ మళ్లీ ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతోంది. జబర్దస్త్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఇంద్రజ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేస్తోంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోల్లోనూ జడ్జిగా కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తోంది. తాజాగా, వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న ఇంద్రజ షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లలో కనిపించే కొన్ని ట్రెండ్స్, అవుట్‌ఫిట్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. అలాగే వాటిని ధరించిన అమ్మాయిలు.. నా డ్రెస్ నా ఇష్టం నాకు నచ్చినట్లే ఉంటా నువ్వెవరు అడగడానికి అని అంటే కుదరని ఫైర్ అయింది.
పబ్లిక్‌గా తిరుగుతూ అసభ్యకరంగా కాస్ట్యూమ్ ఉంటే.. ఎదుటివారికి కూడా కామెంట్ చేసే హక్కు ఉంటుదని చెప్పింది. అంతేకాకుండా ఇంట్లో ఎలా ఉన్నా కానీ ఫ్రెండ్స్, ప్రైవేట్ స్పేస్‌లో పద్ధతిగా, మర్యాద, డ్రెస్సింగ్ సెన్స్‌తో ఉండాలని వ్యాఖ్యానించింది. ఇంట్లో నచ్చినట్లు మాట్లాడినట్లుగా.. బయట స్టైల్‌గా ఉండి మాట్లాడతానంటే అది పనిచేయదు అని అన్నారు. నా డ్రెస్ నా ఇష్టం అంటే ఒకేకానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఎందుకు అలా అంటున్నారనే రైట్ లేదని పేర్కొంది. అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఒకరి అభిప్రాయం నచ్చకపోయినా .. ఎదుటివారి నోరు మూయించలేం అని వివరించింది. మీ దుస్తులపై నెగిటీవ్ కామెంట్స్ చేసినా తట్టుకునే ధైర్యం ఉంటేనే అలాంటి అవుట్‌ఫిట్స్ ధరించాలని కోరింది.
పబ్లిక్‌లోకిరాగానే, అసభ్యకరంగా కనిపించే విధంగా కాకుండా పద్దతిగా ఉండాలి. ట్రోల్స్ వచ్చినా సరే అనుకుంటే బోల్డ్ డ్రెస్సింగ్ ప్రయత్నించండి అని సూచించింది. ప్రస్తుతం ఇంద్రజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇంద్రజకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత హక్కు కాబట్టి ఎవరి ఇష్టం వారిది.. అలాంటి బట్టలే వేసుకోవాలని చెప్పే హక్కు మీకు లేదని కౌంటర్లు వేస్తున్నారు.






