- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూవీతో ఒత్తిడి పెరుగుతుందనుకుంటే..నా కోరిక నెరవేరింది: షాలిని పాండే
యంగ్ హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey)‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey)‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంతోనే అమ్మడు రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని పాండే ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘అర్జున్ రెడ్డి’ చేస్తున్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం. అందరం కలిసి ఒక మంచి మూవీ చేయాలనే తపనతో పనిచేశాం. అది విడుదలై అంత పెద్ద విజయం సాధించిన తర్వాత, నాపై ఒత్తిడి పెరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ నిజానికి నాకు నటిగా మంచి గుర్తింపు లభించింది.
నటి కావాలన్న నా కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో ఒత్తిడిని ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని మాత్రమే అనుకున్నాను. ఆ తర్వాత నేను పనిచేసిన సినిమాల్లో కూడా మంచి నటులు, దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఒకే రకమైన కథలు కాకుండా.. విభిన్న పాత్రల్లో నటించాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






